మిమ్మల్ని చూసి యువత నేర్చుకుంటారు: మోదీ

Admin - August 20, 2020 / 10:21 AM IST

మిమ్మల్ని చూసి యువత నేర్చుకుంటారు: మోదీ

మహేందర్ సింగ్ ధోని ఇంటర్నేషన్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ధోని రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ప్రధాని మోడీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ధోనీకి లేఖ రాశారు.

“మీరు క్రికెట్ మ్యాచ్ లో ప్రత్యర్థుల ఊహలకు అందని నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ను గెలుపు వైపు నడిపించిన మీరు, ఇప్పుడు ఎవ్వరూ ఊహించని సమయంలో మీరు పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియోతో దేశం మొత్తం మీ గురించి చర్చించుకునేలా చేశారు. కానీ మీరు చెప్పిన విషయం క్రికెట్ అభిమానులకు నిరాశ పరిచినా కూడా క్రికెట్ లో మీరు చూపిన ప్రతిభను గుర్తు చేసుకున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే క్రికెటర్ గా మీరు సృష్టించిన రికార్డ్స్ , కెప్టెన్ గా మీరు సాదించిన విజయాలు ఊహలకు అందనివి. గొప్ప బ్యాట్స్ మెన్స్ లలో మీరు ఒకరు కానీ మీరు ఒక గొప్ప కెప్టెన్. అలాగే క్రికెట్ ఎప్పుడు చూడని గొప్ప వికెట్ కీపర్. కఠినమైన సమయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం ఎన్నోసార్లు విజయాన్ని చూసింది. దీనికి 2011 వరల్డ్ కప్ లో, 2007 టి-20 లో మీరు తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం.

మిమ్మల్ని కేవలం ఒక ఆటగాడిగా చూడటం అనేది ఇన్ జస్టిస్ అవుతుంది. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. చిన్న టౌన్ నుండి వచ్చి ఉన్నత శిఖరాలు చేరిన మీరు యువతరానికి ఆదర్శం. గొప్ప విజయాలు సాధించడానికి గొప్ప కుటుంబం నుండి రావాల్సిన అవసరం లేదని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మన కుటుంబ స్థితిగతులు అడ్డంకులు కాదని మీరు నిరూపించారు.

గెలుపోటములకు సంబంధం లేకుండా నిర్దిష్టమైన స్వభావాన్ని కలిగి ఉండే మీరు యంగ్ జనరేషన్ కు ఆదర్శం. ఇండియన్ ఆర్మీ పట్ల మీరు చూపే శ్రద్ధ వర్ణించలేనిది. ఆర్మీలో సంతోషంగా ఉన్న సైనికుల్లో మీరూ ఒకరు. మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. సాక్షి, జీవాలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. వారి సపోర్ట్ వల్లే మీరు ఇన్ని శిఖరాలు చేరుకున్నారు. పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెసినల్ లైఫ్ ను ఎలా బ్యాలన్స్ చెయ్యాలో మీ దగ్గర నుండే యువత నేర్చుకోవాలి.

భవిష్యత్తులో కూడా మీరు అనుకున్న శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నా.” అని లేఖలో పేర్కొన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us