ప్రధాని నరేంద్ర మోడీ వెబ్ సైట్ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్వయంగా ట్విట్టర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ విషయంపై విచారణ చేపట్టామని, ఈ అకౌంట్ రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని ట్విట్టర్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ట్విట్టర్ ను హ్యాక్ చేశారు.

అయితే జాతీయ రిలీఫ్ ఫండ్ ‌కు క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు అని మోడీకి సంబందించిన వెబ్‌సైట్ పేజీలో ట్వీట్లు చేసారు. నరేంద్ర మోడి(@narendramodi_in.) అకౌంట్‌ పై ట్వీట్ చేసినట్లు బయటపడింది. దీనితో మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విట్టర్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలకు సంబందించిన పలు ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here