మోడీ దెబ్బకు తోక ముడిచిన చైనా

Advertisement

మోడీ దెబ్బకు తోక ముడిచిన చైనా .. ఉన్న చోట నుండి 2 కిలో మీటర్ల వరకు వెనిక్కి … స్థావరాలతో సహా వెనుతిరిగిన సైన్యం . పూర్తి వివరాల్లోకి వెళితే గతం లో చైనా మరియు భారత్ ల మధ్య జరిగిన ఘటన లో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే యుద్ధం దిశగా కొనసాగబోతున్న సూచనలు… అంధ చేసే విధంగా ప్రవర్తించింది చైనా సైన్యం. అయితే అనవసర సమయాల్లో యుద్ధం వద్దు అని ఆ ఆలోచించిన భారత ప్రభుత్వం మరియు సైన్యం మాత్రం శాంతి చర్చలు జరపడానికి ప్రయత్నిచడం జరిగింది .

ఇలా శాంతి చర్చలు జరిపే క్రమం లోనే ఇరు సైన్యాల కమాండర్ లు 3 దఫాలుగా ఈ శాంతి ఒప్పందపు చర్చల కు హాజరు అయ్యారు . అయితే ఇప్పటి వరకు సామరస్యంగా ఈ సమస్య ని పరిష్కరించుకుందాం అని చర్చలు జరిపినప్పటికీ అది ఇంకా అమలు కాలేదు. ఇలా చైనా చర్చలకు వచ్చినట్టు వస్తూనే దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తుంది . భారీగా బలగాలను ముందుకు తీసుకు రావడం , సైనిక స్థావరాలను ఏర్పాట్లు చేయడం వంటి చర్యలను కొనసాగిస్తూ వెళ్తుంది చైనా . ఇలాంటి సమయం లోనే మోడీ లడక్ ఆకస్మిక పర్యటన చైనా సైనిక బలగాన్ని భయోంధలనకు గురి చేసింది .

సమస్య ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇలాంటి సమయం లో రెచ్చ గొట్టేలా వ్యవహరించి యుద్ధానికి కారణం కాకూడదు అని ప్రధాని మోడీ పర్యటనని ఉద్దేశించి చైనా తెలపడం జరిగింది . మోడీ ఆకస్మిక పర్యటన జరిగిన రెండు రోజుల అనంతరం చైనా బలగాలు వెనిక్కి మళ్ళాయి . అయితే ఇప్పటికి బారి ఆయుధాలతో కూడిన చైనా వాహనాలు మాత్రం ఇంకా గాల్వన్ నది తీరం లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం లో భారత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీక్షిస్తుంది. అయితే ప్రస్తుతం భారత్ కి సపోర్ట్ గా ఎన్నో దేశాలు కూడా ముందుకు రావడం అంతే కాకుండా ప్రధాని మోడీ పర్యటన వాళ్లలో యుద్ధ భయాన్ని ఏర్పడేలా చేసి వారు వెనిక్కి తగ్గడానికి కారణం అయినట్లు తెలుస్తుంది .

ప్రస్తుత పరిస్థులలో చైనా వెనక్కి తగ్గడానికి కారణం భారత్ సైన్యం మరియు భారత్ కి అందుతున్న చాలా దేశాల సపోర్ట్ .. ఇవి మాత్రమే కాకుండా యుద్ధ ప్రాతి పదికలలో భారత్ ఆలోచన తీరు . అయితే ఇవన్నినింటిని అలోచించి చైనా వెనిక్కి వెళ్లినప్పటికీ ఒక వేల దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చైనా కనుక చేస్తే ఎప్పటికప్పుడు చైనా బలగాలని వారి పని తీరుని పరీశీలిస్తున్న భారత్ దానిని ఎదొర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here