ఆ పది రాష్ట్రాలు కట్టడి చేస్తే కరోనా పై విజయమే : ప్రధాని మోడీ

Advertisement

కరోనా కట్టడి గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని కరోనా కట్టడి గురించి పలు విషయాలు చేర్చించారు. ముఖ్యంగా దేశంలో
నమోదవుతున్న కరోనా‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో ఆ పది రాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్‌ విజయం సాధించినట్లే అని అన్నాడు.

అందుకే ఆ పది రాష్ట్రాల్లో కరోనా‌ పరీక్షలను మరింత పెంచాలని మోడీ సూచించారు. ముఖ్యంగా బిహార్‌, యూపీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా‌ పరీక్షల సంఖ్య తక్కువగా ఉందని అన్నాడు. అందుకే ఆ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య అధికంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here