ప్రణబ్ ముఖర్జీ కి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ

Advertisement

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దేశం మొత్తం కూడా శోకసంద్రోహంలో మునిగిపోయింది. ఇక ప్రణబ్ పార్థీవ దేహం ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. అయితే తాజాగా ప్రణబ్ చిత్ర పటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. అలాగే ప్రణబ్‌ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు.

ఈ రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన పార్థీవ దేహాం సందర్శించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్‌ ముఖర్జీ అంతిమయాత్ర తన నివాసం నుండి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2గంటల సమయాన లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here