జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

Advertisement

విలక్షన నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల సినీ పరిశ్రమ మొత్తం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టీచర్ గా ప్రారంభమైన ఆయన జీవిత ప్రయాణం తరువాత ఎస్ఐగా విధులు నిర్వహించారు. అలాగే విలన్ గా ఆయన మొదట్లో మూవీస్ చేసినప్పటికీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా జయప్రకాష్ రెడ్డి మృతి పై సంతాపం వ్యక్తం చేశారు.

“జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధాని ట్వీట్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here