అండమాన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ బహుమతిని ఇచ్చిన ప్రధాని మోడీ

Advertisement

ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. చెన్నై, పోర్టు బ్లేయర్‌ల మధ్య సముద్ర గర్భంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ కు డిసెంబర్ 30,2018న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. క్షణానికి 2X200 జీబీపీఎస్‌ బ్యాండ్‌ సామర్థ్యం గల ఈ కేబుల్‌ లింక్‌ వల్ల.. పోర్ట్‌ బ్లేయర్‌తో సహా ఇతర అండమాన్‌ ద్వీపాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…ఈ పథకం వల్ల అండమాన్ నికోబర్ ప్రజలు ప్రపంచం మరింత మెరుగైన ఆసంబంధాలను పెంచుకోవచ్చని, ఇప్పటి నుండి ఇక్కడి ప్రజలు మరింత మెరుగైన ఇంటర్ నెట్ సేవలను పొందగలరని తెలిపారు. సముద్ర గర్భంలో సుమారు 2300 కిలోమీటర్ల పొడవున ఓఎఫ్‌సీ వ్యవస్థను ఏర్పాటు చేయటం అంత సులభం కాదని, అనుకున్న సమయం కంటే ముందే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కృషి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మోడీ వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబర్ ప్రజలకు ఇదే స్వాతంత్ర్య దినోత్సవ బహుమతని మోడీ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here