రికార్డు సృష్టించిన పీఎం నరేంద్ర మోడీ

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో వరుసగా సుదీర్ఘ కాలం పరిపాలించిన నాలుగవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మొట్టమొదటిసారి 2014 మే 26వతేదీన ప్రమాణస్వీకారం చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధాని నరేంద్ర మోడీ గా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పటి వరకు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి అన్ని పర్యాయాలూ కలుపుకొని 2,268 రోజులు ప్రధానిగా కొనసాగాడు. ఇక ఈ రికార్డు ను నరేంద్ర మోడీ గురువారంతో బ్రేక్ చేశారు.

అయితే మొదటి స్థానంలో జవహర్‌లాల్ నెహ్రూ 16 సంవత్సరాలు 286 రోజులు పని చేసారు. తరువాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 11 సంవత్సరాల 59 రోజుల పాటు భారత ప్రధానిగా రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో ప్రధానిగా మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు 4 రోజులు పదవిలో ఉన్నారు. ఇక 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన అనంతరం నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 353 సీట్లు సాధించి రెండోసారి ప్రధాని పీఠాన్ని అవరోదించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here