ఏపీలోని విజయవాడ కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోడి ఏపీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. అగ్ని ప్రమాద వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే హోటల్‌ను ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని.. ఈ రోజు తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించిందని ప్రధానికి జగన్ వివరించాడు. అలాగే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలిపాడు.
ఈ ప్రమాదంలో దురదుష్టవశాత్తు కొంత మంది మృత్యువాత పడ్డారని అన్నాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని జగన్ తెలిపాడు.
ఈ ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు అందరు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు.