ఏపీలో కొత్తగా 5041 పాజిటివ్ కేసులపై…. జగన్‌కు ప్రధాని ఫోన్

Advertisement

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు ఉధృత స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 5041పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా 56 మంది చనిపోవడం కూడా జరిగింది. కరోనా కేసులు ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతుండడం తో అక్కడి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 31148 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని జిల్లాల్లోనూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 647 కేసులు నమోదు కాగా.. అనంతపురంలో ఈ సంఖ్య 637గా తేలింది. శ్రీకాకుళంలో 535, చిత్తూరులో 440 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో మాత్రమే ఒక్క రోజులో 150 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 642గా లెక్క తేల్చారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా. సామజిక వ్యాప్తి దశకు చేరుకుంది అని అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. అంటే కేవలం పట్టణాల్లో మాత్రమే కాకుండా పల్లెల్లోకి కూడా ఇది వ్యాపించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. దానితో కొన్ని ప్రాంతాలలో స్వచ్చంధ లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ వంటివి కూడా అమలుచేస్తున్నారు. అయినా లాభం లేకుండాపోతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో విరుచుకుపడుతున్న కరోనా కేసులపైనా ప్రధాని మోడీ స్పదించి ముఖ్యమంత్రి జగన్ కి కాల్ చేయడం కూడా జరిగింది. కాల్ లో ప్రధాని , జగన్ తో మాట్లాడుతూ కరోనా తీవ్రత, కట్టడిని చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం అంధచేశారు.

ఇక రాబోయే రోజుల్లో కరోనా రాని వారంటూ ఎవరూ ఉండరన్న అభిప్రాయంతో జగన్ ప్రజల ప్రాణాలను లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం కూడా కొన్ని చోట్ల వినిపిస్తోంది. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు ప్రస్తుతం తీసుకోవడం లేదు. లాక్ డౌన్ పేరుతో కొన్ని చోట్ల కట్టడి చేస్తున్నప్పటికీ ఉపయోగడం ఉండటం లేదు. ఇక ఊహించని స్థాయిలో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంబవిస్తుండడంతో కరోనా బారిన పడిన వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 26118 ఉండడం జరిగింది. మరి ఇలా ప్రధాని మోడీ మాటలు సూచనల తరువాత ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడిలో బాగంగా కొత్త చర్యలు ఏమైనా చేపడుతాడేమో చూడాలి మరి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here