విద్యను తరగతి గదులకే పరిమితం చేయొద్దు : ప్రధాని మోడీ

Advertisement

విద్య అనేది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాగా ఉండాలని, అలాగే మెరుగైన విద్యను నేర్చుకోవాలంటే విద్యను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయొద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చదువులను బయటి ప్రపంచంతో అనుసంధానం చేయాలని, అందువల్ల దాని ప్రభావం విద్యార్థుల జీవితాలపై మాత్రమే కాకుండా యావత్ సమాజం పైనా ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశం పై ఈ రోజు మోడీ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రసంగించారు.

అయితే విద్యాబోధనలో సులువైన, వినూత్నమైన పద్ధతులను పెంచాలని ప్రధాని సూచించారు. అలాగే నవతరం శిక్షణకు మన ప్రయోగం మూల ఆధారం కావాలన్నారు. అధ్యయనం చేయడం, అనుభూతి చెందడం, ఆకర్షించడం, వ్యక్తపరచడం, అసాధారణ ప్రతిభ కనబరచడం కోసం కృషి చేయాలన్నారు. విద్యార్థులు అన్ని రకాలుగా సమానంగా ఆలోచించగలగాలని, గొప్ప మేధస్సు ను పెంచుకోవాలని ప్రధాని మోడీ కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here