Pigeon : కర్ణాటక నుండి కేరళ శబరిమల తీసుకు వెళ్లి వదిలేసినా తిగిరి వచ్చిన పావురం
NQ Staff - January 6, 2023 / 06:18 PM IST

Pigeon : మనుషుల కంటే జంతువులకు మరియు పక్షులకు ఎక్కువ విశ్వాసం ఉంటుందని అంటారు. ఆ విశ్వాసం కొన్ని సార్లు ప్రత్యక్షంగా కూడా నిరూపితం అవుతుంది. పక్షులకు మనుషులకు ఉన్నంత జ్ఞాపక శక్తి కంటే ఎక్కువగానే ఉంటుందని కూడా కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది.
తాజాగా కర్ణాటక, చిత్రదుర్గ జిల్లా కు చెందిన వ్యక్తి తాను పెంచుకునే పావురాన్ని ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనంకు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చాడు. దేవుడి వద్ద ఆ పావురాన్ని వదిలేసి వచ్చిన ఆ భక్తుడు తాజాగా షాక్ అయ్యాడు.
డిసెంబర్ 30వ తారీఖున శబరిమలలో తన పెంపుడు పావురాన్ని ఆయన వదిలేసి వచ్చాడు, ఆశ్చర్యంగా నిన్న గురువారం ఆ పావురం కర్ణాటకలోని తన ఇంటికి చేరుకుంది. దాదాపు వారం రోజుల పాటు ప్రయాణించిన పావురం తిరిగి యజమాని ఒడికి చేరింది.
ఈ సంఘటన స్థానికులను అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత దూరంను ఎలా గుర్తు పెట్టుకొని పావురం కర్ణాటక కు వచ్చింది.. యజమాని యొక్క ఇల్లు మరియు ప్రాంతాన్ని అంత దూరం నుండి ఎలా గుర్తించింది అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.