Pig heart: వైద్య శాస్త్రంలో చారిత్ర‌క ఘ‌ట్టం.. పంది గుండె మ‌నిషికి ..!

Pig heart: వైద్యశాస్త్రంలో అనేక చారిత్ర‌క ఘ‌ట్టాలు వెలుగు చూస్తున్నాయి.మ‌నుషుల అవ‌య‌వాలు ప‌ని చేయ‌న‌ప్పుడు జంతువుల గుండె, కిడ్నీలు అమ‌ర్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మధ్య ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్‌లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్‎ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది.

Pig Heart Transplantation To Human3
Pig Heart Transplantation To Human3

కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో పంది కిడ్నీని అమ‌ర్చ‌డం పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక శుక్రవారం బాల్టిమోర్‌ ‘మేరీలాండ్‌ మెడికల్‌ స్కూల్‌ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.

పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది.

57 ఏళ్ల డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్‌ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్‌ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్‌ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది.

Pig Heart Transplantation To Human3
Pig Heart Transplantation To Human3

అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.