Tollywood : వాట్.. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను శివాత్మిక పెండ్లి చేసుకోబోతుందా..?

NQ Staff - February 2, 2023 / 01:10 PM IST

Tollywood : వాట్.. సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను శివాత్మిక పెండ్లి చేసుకోబోతుందా..?

Tollywood  : సింగర్‌ గా రాహుల్‌ సిప్లిగంజ్‌ కు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాడిన నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. అలాగే హీరో రాజశేఖర్‌ కూతురుగా శివాత్మికకు కూడా మంచి పేరుంది. ఆమె కూడా ఇప్పుడు నటిగా బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ.

ఈ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక, ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ కలిసి నటిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఇంకా సినిమా రిలీజ్‌ కావట్లేదు. కానీ సినిమా గురించి అప్పుడప్పుడు ఏదో ఒక అప్‌ డేట్‌ అయితే ఇస్తున్నారు.

తాజాగా పిక్‌ రిలీజ్‌..

 

కృష్ణవంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా మూవీకి సంబంధించిన ఓ పిక్‌ రిలీజ్‌ అయింది. ఇందులో పెండ్లి కూతురుగా శివాత్మిక ఉండగా.. పక్కనే పెండ్లి కొడుకుగా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఉన్నాడు.

 Pic Related To Rangamarthanda Movie Released

Pic Related To Rangamarthanda Movie Released

ఇది చూసిన వారంతా కూడా మీరిద్దరూ పెండ్లి చేసుకుంటున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చేసుకోండి మీ జంట చూడముచ్చటగా ఉంటుంది అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా వరకే అయినా కూడా వీరిద్దరి జంట బాగుంది అంటూ ట్రెండింగ్‌ లో ఉంచుతున్నారు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us