Petrol Rate: పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్..!?

petrol price

Petrol Rate(పెట్రోల్): దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా కేంద్ర బడ్జెట్ అంశంపై ఎదురుచుస్తున్న సామాన్య మనవడికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. స్పీకర్‌ ఓం బిర్లా వారించినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇక పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త పెట్రోలియం ఉత్పత్తులపై అగ్రిసెస్ వేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో డిజీల్ ధర రూ.4 పెరుగనుంది. అటు పెట్రోల్ ధర రెండున్నర రూపాయలు పెరిగే అవకాశముంది.

ఇక బడ్జెట్ లో కామన్ మ్యాన్(సామాన్యుడికి) ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం.. భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కామన్ మ్యాన్ కి పెట్రో వాత పెట్టింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్(సుంకం) విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ.2.50, డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ కారణంగా ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు మరింత పెరగనున్నాయి.

అయితే డీజిల్, పెట్రోల్ ట్యాక్సుల విషయంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం విధించారు. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటా, సెస్సు మొత్తం కేంద్రం ఖజనాకే చేరనుంది. మార్పులు చేర్పులతో రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి పడనుంది. కాగా, అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ తో లీటర్‌ పెట్రోలు ధర సెంచరీ దాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరిన సంగతి తెలిసిందే. అయితే నిర్మలా సితారామన్ మాత్రం ఈ పెట్రో ధరల పెంపు సామాన్యులపై భారం పడదు అని వెల్లడించారు..

Advertisement