Perni Nani : నా చెప్పు పోయి 9 నెలలు అవుతోంది.. పవన్ కి నాని స్ట్రాంగ్ కౌంటర్
NQ Staff - June 17, 2023 / 06:40 PM IST

Perni Nani : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం లో తన చెప్పులు పోయాయి అంటూ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మూడు రోజుల క్రితం పోయిన చెప్పుల గురించే పవన్ కళ్యాణ్ తెగ హైరానా పడిపోతున్నాడు అంటూ ప్రశ్నించాడు.
ఎప్పుడో 9 నెలల క్రితం నా చెప్పుల్లో ఒక చెప్పు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ముందు ఉన్న దేవాలయం వద్దకు వెళ్లిన సమయంలో పోయాయి అంటూ నాని అన్నాడు. వారి పార్టీ ఆఫీస్ ముందు పోయింది కదా అని వెళ్లి పవన్ కళ్యాణ్ ను నా చెప్పు విషయం అడగలేను కదా అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చాడు.
మూడు రోజుల క్రితం పోయిన చెప్పుల జత గురించి పవన్ కళ్యాన్ తెగ కంగారు పడుతున్నాడు. ఆ చెప్పులు పోతే నీకు ఎవరో ఒక నిర్మాత కొనస్తాడు. ఆ విషయంలో ఆందోళన అక్కర్లేదు. కానీ నీ యొక్క పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ పోయింది చూసుకో. అది ఎక్కడైనా దొరుకుతుందేమో చూసుకో అంటూ కామెంట్ చేశాడు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా వైకాపా పై చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ నాయకులు చాలా గట్టిగా సమాధానం ఇస్తున్నారు. సినిమా డైలాగ్స్ చెబుతూ.. పంచ్ డైలాగ్స్ ను వదులుతూ పవన్ వారాహి యాత్ర ఒక రాజకీయ యాత్ర అన్నట్లుగా కాకుండా షో పుటప్ అన్నట్లుగానే ఉంటుందనే అభిప్రాయాన్ని వైకాపా నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్????
అక్టోబర్ 18న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తే ఎవడో నా ఒక చెప్పు కొట్టేశాడు
ఎదురుగా పవన్ ఆఫీస్ ఉందని అనుమానించలేం కదా?
నా ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోంది
ఆ ఒక చెప్పు పట్టుకెళ్లినోడు దాంతో ఏం చేసుకుంటాడో?
చెప్పులు పోయి మూడ్రోజులకే… pic.twitter.com/lPxhhKSpul
— Rahul (@2024YCP) June 17, 2023