Nara Lokesh : అలా జరిగితే యువగళం పాదయాత్ర జరగదట
NQ Staff - January 25, 2023 / 07:34 PM IST

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోతున్న పాదయాత్రకి ఏపీ పోలీస్ శాఖ షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేయడం జరిగింది. ఈనెల 27వ తారీకు నుండి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం లో నారా లోకేష్ యొక్క పాదయాత్ర ప్రారంభం కాబోతుంది.
పాదయాత్ర ప్రారంభం కి నారా మరియు నందమూరి ఫ్యామిలీ హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు పాద యాత్రలో ఎక్కడైనా స్పీకర్స్ వినియోగించినా.. లేదంటే బాణా సంచా కాల్చిన రోడ్ షో మాదిరిగా చేసినా కూడా వెంటనే పాద యాత్ర కి అనుమతులు రద్దు చేయబోతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
లోకేష్ పాదయాత్రకి అనుమతులు కండిషన్స్ తో ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ లో ఏ ఒక్కటి మీరినా కూడా లోకేష్ పాదయాత్ర ని కొనసాగించేది లేదని పోలీసులు పేర్కొన్నారు.
మరో వైపు వైకాపా నాయకులు అడుగడుగునా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.