Telangana: న‌ర్సుకి భారీ మ‌ద్ద‌తు…డ్యాన్స్ చేస్తే తీసేస్తారా అంటూ ఫైర్

Telangana: పెళ్లి బరాత్‌లో వధువు.. వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అనే సాంగ్‌కి డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట ఫుల్ వైర‌ల్ కావ‌డంతో పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుఈ వ్యవహారంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు.


People's Support for Telangana Nurse Who danced for Bulletu bandi Song
People’s Support for Telangana Nurse Who danced for Bulletu bandi Song

ఆన్‌ డ్యూటీలో ఉండటమే కాకుండా.. ఇండిపెండెంట్స్‌ డే రోజున ఇలా పాటలు పెట్టుకోని డ్యాన్స్‌లు చేయడంపై మండిపడ్డారు. డ్యాన్స్‌ చేసిన మహిళకు మెమో జారీ చేశారు.తాను డ్యూటీ డుమ్మా కొట్టి డ్యాన్స్ చేయ‌లేదుని, తొటి న‌ర్సులు ఎంక‌రేజ్ చేస్తే డ్యాన్స్ చేసాన‌ని పేర్కొంది. అయితే న‌ర్సుకి మెమో ఇవ్వ‌డంపై తోటి న‌ర్సుల‌తో పాటు నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నర్సుకు అధికారులు మెమో ఇవ్వడాన్ని ఇతర నర్సులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నర్సు డ్యూటీలో చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాంత‌త్ర్యం దినోత్సవం రోజున రిలాక్సేషన్ కోసం డ్యాన్స్ చేస్తే దాన్ని పెద్ద రాద్దాంతం చేయడం సరికాదన్నారు. సరదాకి అలా చేస్తే.. మెమో ఇవ్వడం సరికాదని ఆక్షేపించారు. ఈ మేరకు ఓ సీనియర్ నర్సు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డ్యూటీలో మందు తాగిన వారిని, రూ. 20 కోట్లు స్కాం చేసిన వారిని ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రజారోగ్య డైరెక్టర్ తప్పు చేశారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చూపించినా.. ఆ అధికారిని ఏం చేశారని ఆమె ప్రశ్నలు గుప్పించారు ప్రభుత్వం నర్సుకు మెమో ఇవ్వడం.. కొవిడ్ వారియర్లుగా పనిచేసిన నర్సులను అవమానించడమేనని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ పేర్కొంది.

తెలంగాణ సంస్కృతిలోనే ఆటాపాట ఉందని, బతుకమ్మ పాటలతో ఆడిపాడించిన ప్రభుత్వం.. ఇలా చేయ‌డం త‌గ‌దు అని పేర్కొన్నారు.సదరు నర్సుకి మద్దతుగా బీజేపీ నేతలు సైతం ప్రెస్‌మీట్ పెట్టడం విశేషం. పదేళ్లకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోందని.. కరోనా కాలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిందన్నారు.

నర్సుకి భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తున్ నేప‌థ్యంలో ఆమెకు ఇచ్చిన మెమో వెన‌క్కి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్న రజని.. కరోనా రోగులకు సేవలు చేసిన క్రమంలో తాను కూడా వైరస్‌ బారిన పడ్డారు. అనంతరం కోలుకొన్నారు.