Adipurush : ఆదిపురుష్ థియేటర్లలో పవన్ కల్యాణ్‌ సందడి.. ఫ్యాన్స్ కు పూనకాలొచ్చే వార్త..!

NQ Staff - June 5, 2023 / 11:10 AM IST

Adipurush : ఆదిపురుష్ థియేటర్లలో పవన్ కల్యాణ్‌ సందడి.. ఫ్యాన్స్ కు పూనకాలొచ్చే వార్త..!

Adipurush  : పవన్ కల్యాణ్‌, ప్రభాస్.. ఈ రెండు పేర్లు వింటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. ఆ రేంజ్ లో ఇద్దరికీ ఫాలోయింగ్ ఉంది. కాగా ఇప్పుడు ఇద్దరు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.180కోట్లకు పైగా కొనుగోలు చేసింది.

రేపు తిరుపతి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీవినీ ఎరుగని రీతిలో జరిపించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ఏకంగా రూ.3 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే ఓ రేంజ్ లో ప్రమోషన్లు కూడా చేస్తోంది. కాగా ఇదే సంస్థ పవన్ కల్యాన్‌, సాయిధరమ్ తేజ్ కాంబోలో బ్రో అనే సినిమాను కూడా చేస్తోంది.

బ్రో సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్ డేట్ కూడా రావట్లేదు. ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ మూవీ టీజర్ కట్ చేసి రెడీగా ఉంచారంట. ఆదిపురుష్ మూవీతో అటాచ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని పీపుల్స్ మీడియా భావిస్తోంది.

పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఆదిపురుష్‌ లాంటి బడా మూవీతో రిలీజ్ చేస్తే కచ్చితంగా బ్రో సినిమా గ్రౌండ్ లెవల్లోకి వెళ్తుందంట. అంటే ప్రభాస్ సినిమా ఆడుతున్న థియేటర్లలో పవన్ కల్యాణ్‌ సందడి చేయనున్నాడన్న మాట. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ప్రభాస్ మూవీ కోసం థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us