Health Tips : మీ శరీరంలో ఐరన్ సమస్యలు ఉన్నాయని ఇలా గుర్తించండి
NQ Staff - December 27, 2022 / 10:25 AM IST
Health Tips : మానవ శరీరంలో అన్ని సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యంతో ఉంటాం. ఏ ఒక్కటి సమతుల్యం లోపించినా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అత్యంత కీలకమైన ఐరన్ ఖనిజం శరీరానికి తగ్గినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడంలో ఐరన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. ఐరన్ లోపంతో బాధపడే వారు మానసిక సమస్యలను ఎదుర్కోవడంతో పాటు బద్ధకంగా వ్యవహరిస్తూ ఉంటారు.
అంతే కాకుండా ఎప్పుడూ మత్తుగా పడుకోవాలనుకుంటారు. ఇంకా ఐరన్ లోపంతో బాధపడే వారికి గుండె సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ సమపాళ్లలో లేని వారు పదే పదే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ముఖ్యంగా మహిళలు అది కూడా గర్భిణీ స్త్రీలు ఐరన్ కచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, గుండె నొప్పి, కాళ్ళ వాపులు ఇలాంటివి వస్తే ఐరన్ లోపంగా భావించవచ్చు.
ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడంతో పాటు పలు ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఐరన్ పొందవచ్చు. ముఖ్యంగా సి ఫుడ్స్, గుడ్లు, బీన్స్, బచ్చలి కూర, ఎండు ద్రాక్ష, తృణ ధాన్యాలు, బఠానీలు ఐరన్ ని శరీరానికి అందిస్తాయి. కనుక ఏమాత్రం ఐరన్ లోపం ఉందనిపించినా కూడా పై ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ట్యాబ్లెట్స్ ను వాడుకోవడం బెటర్.