Poll Strategy Group Survey : మళ్లీ జగనే సీఎం.. తేల్చి చెప్పిన పోల్ స్ట్రాటజీ సంస్థ..!
NQ Staff - July 14, 2023 / 11:44 AM IST

People Of AP Say YS Jagan Mohan Reddy CM In Poll Strategy Group Survey :
ఏపీలో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. మళ్లీ ఎవరు సీఎం.. ఏ పార్టీ గెలుస్తుందంటూ సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి కొన్ని ప్రముఖ సంస్థలు. అయితే ఏ సర్వే నిర్వహించినా సరే జగన్ పేరు మార్మోగుతోంది. సంస్థ ఏదైనా సరే జగనే సీఎం అంటున్నారు ఏపీ జనాలు. నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్టు.. జనమంతా కలిసి జగనే మా సీఎం అంటున్నారు.
ఇప్పటికే టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో ఎలాంటి శషబిషలకు తావు లేకుండా మళ్లీ జగనే సీఎం అవుతారని తేలింది. ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే ప్రముఖ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా జగన్ కు తిరుగులేదని తేల్చి చెప్పారు ఏపీ ఓటర్లు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని ఆరోపణలు చేసినా.. చివరకు ఓటర్లు జగన్ ను మాత్రమే తమ సీఎంగా చూడాలని డిసైడ్ అయ్యారు.
పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని తేలింది. వైసీపీకి ఎవరూ ఊహించనంత భారీ మెజార్టీ వస్తుందని ఈ సర్వే చెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు వస్తాయని తేలింది. టీడీపీ పార్టీకి 37 శాతం ఓట్లు వస్తున్నాయి.
ఇక జనసేన పార్టీకి అయితే మరీ దారుణంగా 7 శాతం ఓట్లు మాత్రమే పడుతాయని చెప్పింది ఈ సంస్థ. ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ పాలన ఎలా ఉందని సర్వే చేయగా.. 56 శాతం మంది బాగుందని తెలిపారు. 9 శాతం మంది అద్భుతంగా ఉందన్నారు. 22 శాతం మంది బాలేదని అన్నారు. 8 శాతం మంది అసలు బాలేదని చెప్పారు. మిగిలిన 3 శాతం మంది ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉండిపోయారు.
YS Jagan Mohan Reddy CM In Poll Strategy
గతంతో పోలిస్తే పెరిగిన ఓటు బ్యాంకు..
ఈ సర్వేలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. 2019తో ఫలితాలతో పోలిస్తే.. ఈ సారి వైసీపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ఇలా ఏ సర్వే చేసినా సరే జగన్ కు అత్యధికంగా ఓటు బ్యాంకు రావడానికి ప్రధాన కారణం సంక్షేమ, అభివృద్ధి పథకాలే కారణం అని తేలుతోంది. ప్రజల్లో జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలపై నమ్మకం బాగా పెరిగిపోయింది.
నవరత్నాల స్కీములు, నాడు-నేడు, అమ్మొడి, పింఛన్, విమనాశ్రయాలు, వైద్యరంగాల్లో పెట్టుబడులు, విద్యా రంగంలో మార్పులు, ఏపీలో పరిశ్రమల పెట్టుబడులు.. ఇలా అన్ని రంగాల్లో జగన్ తీసుకు వస్తున్న మార్పులే ఈ ఓటు బ్యాంకును పెంచాయని చెబుతున్నాయి ఈ సర్వేలు.
ఇక ప్రతిపక్షాల సంగతి మహా ఘోరంగా మారిపోయింది. పొత్తు లేకుండా వెళ్తే ఓటమి ఖాయమని చంద్రబాబుకు అర్థమైంది. కానీ ఎవరితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఒక మాట మీద ఉండట్లేదు. నిలకడ లేని మాటలతో ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు.
కాబట్టి చంద్రబాబు పవన్ తో వెళ్లాలా వద్దా అనే సంశయంలో ఉన్నాడు. అటు బీజేపీతో వెళ్తే కలిసి వస్తుందా లేదా తెలియదు. పవన్ కల్యాణ్ ఎటు వెళ్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కేవలం జగన్ మాత్రమే ఎవరికీ పొత్తు లేకుండా ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. అందుకే ఆయనకు మరోసారి అధికారం ఖాయమని తేలుతోంది.