Pawan kalyan : లాజిక్ మిస్ అవుతున్న పవన్.. ఆ మాత్రం తెలియకుండా అనేస్తే ఎలా..?

NQ Staff - October 4, 2023 / 12:11 PM IST

Pawan kalyan : లాజిక్ మిస్ అవుతున్న పవన్.. ఆ మాత్రం తెలియకుండా అనేస్తే ఎలా..?

Pawan kalyan :

పవన్ కల్యాణ్‌ నోటికి అద్దూఅదుపు లేకుండా పోతోంది. అదే ఆయన కొంప ముంచుతోంది. చివరకు జనసైనికులను బలి చేస్తోంది. అందుకే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తో పాటు జనసైనికులు కూడా పవన్ వ్యాఖ్యలతో తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు. కొన్ని సార్లు పవన్ చేసే ఆరోపనలు తీవ్ర విమర్శలకు తావిస్తుంటాయి. దాంతో పార్టీ ఇమేజ్ తో పాటు పవన్ మీద ఉన్న నమ్మకం కూడా జనసైనికుల్లో, అలాగే కాపు యువతలో పోతోంది. కానీ పవన్ మాత్రం ఇలాంటి మతిలేని మాటలు, లాజిక్ లేని కామెంట్లు చేయడం అస్సలు ఆపట్లేదు. ఆరు నెలలకు ముందే చంద్రబాబుతో పొత్తులు పెట్టేసుకున్నాడు జనసేన అధినేత.

అది తనకు కలిసొచ్చే అంశమని చెబుతున్నాడు. కానీ పవన్ చేసే ఆరోపణలు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు టీడీపీని కూడా ముంచసేలా ఉంది. ఎందుకంటే పవన్ చేసే ఆరోపణలు అలా ఉంటాయి. నిన్న ఆయన వారాహి యాత్రలో మాట్లాడుతూ తన సభలో జగన్ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని.. పులివెందుల నుంచి మూడు వేల మంది రౌడీలను తన సభలోకి పంపిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే ఇక్కడే ఓ లాజిక్ మిస్ అవుతున్నాడు జనసేన అధినేత. అదేంటంటే.. అసలు ఏ సభలో అయినా అల్లర్లు సృష్టించినా లేదంటే కత్తులు దూసినా, చివరకు రాల్లు రువ్వినా సరే అది అవతలి వారి పనే అని అందరికీ అనుమానం వస్తుంది.

సొంత పార్టీ వాల్లే కొట్టుకున్నా సరే అది అవతలి పార్టీ వారు చేసిన కుట్ర అని అందరూ అంటారు. మరి అలాంటప్పుడు పవన్ సభలో కావాలని జగన్ ఎందుకు అల్లర్లు ప్లాన్ చేస్తాడు. అలా ప్లాన్ చేస్తే అది పవన్ కు ప్లస్ అవుతుందని జగన్ కు ఆ మాత్రం తెలియదా.. ఆ కొంచెం తెలియకుండానే సీఎం అయిపోయా.. మరి ఇంత చిన్న లాజిక్ ను పవన్ ఎందుకు మర్చిపోయాడు. అలా లేనిపోని ఆరోపణలు చేస్తే చివరకు ప్రజల్లో తన మీద నమ్మకం పోతుందని ఎందుకు మర్చిపోయాడు అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఒకటో తరగతి కుర్రాడికి తెలిసిన ఈ చిన్న లాజిక్.. ఇంటర్ మీడియట్ చదివిన పవన్ కు ఎందుకు అర్థం కావట్లేదు.

ఇదే విషయం ఇప్పుడు జనసేనలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పవన్ చేసే తలా తోక లేని ఆరోపణలతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు జనసైనికులు. అసలు పవన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడని వారంతా తలలు పట్టుకుంటున్నారు. పవన్ చేసే ఆరోపణల కారణంగా తమకు భవిష్యత్ లేకుండా పోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాంటి నాయకుడి వెనకాల అసలు ఎందుకు తిరుగుతున్నామా అని వారంతా బాధపడుతున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ వెనకాల తిరిగేందుకు కూడా జనసైనికులు భయపడే రోజులు వస్తున్నాయి. ఆయన మీద కాపు యువతలో కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. మరి రాబోయే ఎన్నికల వరకు అయినా పవన్ వెనకాల జనసైనికులు ఉంటారో లేదో చూడాలి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us