పెద్దపల్లి జిల్లాలో కనువిందు చేస్తున్న వింత చేప

Advertisement

తెలంగాణాలో వర్షాలు జోరుగా కొడుతున్నాయి. ఇప్పటికే ఈ వర్షాలకు వాగులు, వంకలు అన్ని కూడా నిండి తీవ్రంగా ప్రవహిస్తున్నాయి. అయితే పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు బాగానే కురుస్తున్నాయి. అయితే ఈ వర్షానికి ఎలిగేడు మండలం దూలికట్టలో జాలర్లు రోజూ మాదిరి లాగే చేపల వేటకు వెళ్లారు. అయితే వాళ్ళు వేసిన వలలో చాలా చేపలు పడ్డాయి. కానీ ఒక వింత చేప కూడా ఉంది. దీనితో ఆ చేప మాత్రం అందరిని ఆకర్షించింది. అయితే ఈ చేప రకం ఇంతకముందు ఎప్పుడూ చూడలేదంటున్నారు జాలర్లు.

ఇది ఏ చేపో కూడా తమకు తెలియదంటున్నారు. ఈ చేప బంగారు రంగులో ఉండటంతో వింత చేప అంటూ ప్రజలు దీన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. ఎవరూ కూడా ఇది ఏ జాతి చేపో చెప్పలేకపోతున్నారు. సాధారణంగా ఇలాంటి చేపలు ఎక్వేరియంలో చిన్నదిగా ఉంటాయి. వాటిని మనం గోల్డ్ ఫిష్ లు అని కూడా అంటాం. అయితే ఈ చేప కూడా చూడటానికి అలాగే ఉంది. కానీ ఆకారంలో చాలా పెద్దగా ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here