పీసీసీ చీఫ్ కు కరోనా పాజిటివ్

Advertisement

దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులూ కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా కర్ణాటక రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక తనకు పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

ఒకవైపు శివకుమార్ కుటుంబ సబ్యులకు మరియు సన్నిహితులకు కూడా వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. దేశంలోనే కరోనా కేసుల్లో కర్ణాటక నాలుగవ స్థానంలో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,83,665మంది కరోనా బారిన పడ్డారు. అలాగే ఇప్పటివరకూ 4,810 మంది ఈ మహమ్మారి దాటికి ప్రాణాలు విడిచారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 81,230 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here