Payal Rajput Sensational Comments On Director : కోరిక తీరిస్తే పెద్ద ఆఫర్లు ఇస్తామన్నారు.. పాయల్ రాజ్ పుత్ సెన్సేషన్..!

NQ Staff - August 5, 2023 / 12:08 PM IST

Payal Rajput Sensational Comments On Director : కోరిక తీరిస్తే పెద్ద ఆఫర్లు ఇస్తామన్నారు.. పాయల్ రాజ్ పుత్ సెన్సేషన్..!

Payal Rajput Sensational Comments On Director  :

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తూ వస్తోంది. ఆమె చేసిన సినిమాలు దాదాపు అన్నీ బోల్డ్ కంటెంట్ ఉన్నవే. ఆమె వస్తూనే ఆక్స్ 100 సినిమాతో ఓ రేంజ్ లో బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

కానీ దాని తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం ఆమెకు పడలేదు. ఈ సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్  కు ఎక్కువగా ఇలాంటి బోల్డ్ పాత్రలు మాత్రమే వచ్చాయి. ఇక వాటిల్లో కూడా ఆమె బాగానే రెచ్చిపోయింది. కానీ అవి ఏమంత పెద్ద హిట్ కాలేదు. ప్రస్తుతం ఆమె మంగళవారం అనే సినిమాలో మరీ బోల్డ్ పాత్రలో నటిస్తోంది.

మూవీ ప్రమోషన్స్ లో..

ఇక తాజాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఒకేలా ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత చాలామంది నాకు సెక్సువల్ ఆఫర్స్ ఇస్తామన్నారు. వారి కోరికలు తీరిస్తే పెద్ద సినిమాల్లో ఛాన్సులు ఇస్తామని చెప్పారు.

కానీ నేను ఇలాంటి వాటివి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వాటిని తిరస్కరించారు. మీటూ ఉద్యమం తర్వాత కూడా కాస్టింగ్ కౌచ్ పోలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఇది ఉంది. కాకపోతే అది కొందరు బయట పెడుతున్నారు కొందరు పెట్టట్లేదు. ఇప్పటికీ ఏదో ఒక సమయంలో నాకు ఇలాంటివి వినిపిస్తూనే ఉన్నాయి అంటూ తెలిపింది పాయల్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us