Payal Rajput Responded About Dream Hero : ఒక్క రోజైనా అతనితో డేటింగ్ చేయాలని ఉంది.. స్టార్ హీరోపై పాయల్ మోజు..!
NQ Staff - July 2, 2023 / 04:17 PM IST

Payal Rajput Responded About Dream Hero :
హీరోలు అంటే మామూలుగానే అమ్మాయిలకు క్రష్ ఉంటుంది. అయితే కొందరు స్టార్ హీరోలు అంటే హీరోయిన్లకు కూడా క్రష్ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అందరు హీరోయిన్లు బయట పెట్టరు. కొందరు మాత్రమే బయట పెడుతారు. తాజాగా బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన మనసులోని మాటలను బయట పెట్టేసింది.
టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెకు అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. కానీ ఇప్పుడు ఆమెకు పర్వలేదన్నట్టే ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన మూవీ మాయా పేటిక ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. దాంతో ఆమె మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు మీ డ్రీమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దానికి పాయల్ స్పందిస్తూ.. నా డ్రీమ్ హీరో మహేశ్ బాబు. ఆయనతో నటించాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి ఆయనతో ఒక్కరోజైనా డేటింగ్ చేసే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను అంటూ సరదాగా చెప్పింది పాయల్.

Payal Rajput Responded About Dream Hero
అంతే కాకుండా తనకు సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ వస్తుందేమో అని ఎంతో ఆశపడిందంట. కానీ చివరకు ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కు వెళ్లిపోయింది. అప్పటి నుంచే మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది పాయల్ రాజ్ పుత్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.