Payal Rajput Made Sensational Comments On Tollywood Directors : ఆ మూవీ తర్వాత నన్ను చాలామంది దర్శకులు వాడుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్లు..!
NQ Staff - July 1, 2023 / 10:09 AM IST

Payal Rajput Made Sensational Comments On Tollywood Directors :
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె బోల్డ్ బ్యూటీగా సౌత్ ఇండస్ట్రీలో మంచి ముద్ర వేయించుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇస్తూనే బోల్డ్ సన్నివేశాలతో కుర్రాళ్లకు హార్ట్ బీట్ తెప్పించింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఆశించిన మేర పెద్దగా హిట్లు రాలేదు.
స్టార్ హీరోయిన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఆమెకు అదృష్టం పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఆమె కూడా వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ఆమె నటించిన మూవీ మాయా పేటిక. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ప్రమోషన్లు జోరుగా చేస్తోంది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందం, ట్యాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు రావట్లేదని కొందరు అంటారు.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని పాయల్ ను యాంకర్ ప్రశ్నించింది. పాయల్ మాట్లాడుతూ.. నేను ప్రతి సినిమాకు 200 శాతం ఎఫర్ట్ పెడుతాను. కానీ అది హిట్ అవడం, కాకపోవడం మన చేతుల్లో లేదు. అదృష్టం కూడా కలిసి రావాలి.
ఇంకా లోతుగా చెప్పాలంటే ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వత నన్ను కొందరు తప్పుదోవ పట్టించారు. అప్పుడు నాకు పెద్దగా మెచ్యూరిటీ లేదు. అందుకే వారు చెప్పింది నమ్మి కొన్ని సినిమాలు చేశాను. కొందరు దర్శకులు నన్ను వాడుకున్నారు. అందుకే కెరీర్ లో ఇంకా ఎదగలేకపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పాయల్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.