Payal Ghosh Reacts On Casting Couch : వాళ్ల పక్కలో పడుకుంటే నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
NQ Staff - July 8, 2023 / 06:59 PM IST

Payal Ghosh Reacts On Casting Couch :
మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ ఉద్యమం సర్దుకున్న కూడా అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఈ బ్యూటీలు క్యాస్టింగ్ కౌచ్ పేరును ఎప్పుడూ వినిపించేలా చేస్తున్నారు. వీటిలో నిజానిజాలు తెలియదు కానీ వాటి వల్ల ఆ సెలెబ్రిటీల పేర్లు మాత్రం మారుమోగి పోతుంటాయి..
ఇదిలా ఉండగా తాజాగా పాయల్ ఘోష్ కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆఫర్స్ కావాలంటే పడక గదికి వెళ్లాల్సిందే అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.. ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ వంటి సినిమాలతో మెప్పించిన పాయల్ ఘోష్ అందరికి తెలుసు..
ఈ భామ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.. మీటూ ఉద్యమంలో భాగంగా అప్పట్లో ఈమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. ఇక తాజాగా ఈమె తన 11వ సినిమా ”ఫైర్ ఆఫ్ లవ్ రెడ్” అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.
”నేను కూడా కొందరితో బెడ్ షేర్ చేసుకుని ఉంటే నాది కూడా 30వ సినిమా అయ్యేది.. పెద్ద సినిమా ఆఫర్స్ రావాలంటే బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిందే.. లేకపోతే సినిమా ఛాన్సులు రావడం కష్టమే” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. దీంతో ఈమెకు సపోర్ట్ గా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ కొద్దిసేపటికే ఈమె ఈ పోస్ట్ డిలీట్ చేసింది.