Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్‌పై యాసిడ్ అటాక్.. ఎలా జ‌రిగిందో వివ‌రించిన పాయ‌ల్‌

Payal Ghosh: అమ్మాయిల‌పై యాసిడ్ దాడి సంఘ‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్రేమించ‌లేద‌నో, పెళ్లికి ఒప్పుకోలేద‌నో యాసిడ్ దాడులు చేస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ హీరోయిన్ పాయ‌ల్ ఘోష్‌పై దాడి జ‌రిగింది. గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసేందుకు విఫల యత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Payal Ghosh Injured After Suspected Acid Attack
Payal Ghosh Injured After Suspected Acid Attack

ముంబైలో మెడికల్ స్టోర్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు తనపై దాడికి యత్నించారని తెలిపింది. కారులోకి ఎక్కుతున్న సమయంలో ఐరన్ రాడ్డుతో దాడి చేశారని… దాడి చేసిన వారిలో ఒకరి చేతిలో గ్లాస్ బాటిల్ ఉందని… అందులో యాసిడ్ ఉందని తాను భావిస్తున్నానని చెప్పింది. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
Payal Ghosh Injured After Suspected Acid Attack
Payal Ghosh Injured After Suspected Acid Attack

ఈ దాడి నుంచి తాను తప్పించుకున్నట్లు.. కానీ ఎడమ చేతికి గాయాలయ్యాయని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో గట్టిగా అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని.. ఇదే మొదటిసారి అని పాయల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి సంబంధించి ఎవరినైనా.. అనుమానిస్తున్నారా అనే విషయంపై కొన్ని కామెంట్స్ చేసింది పాయల్.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నా జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ముంబైలో తొలిసారి ఇలాంటి ఘటనను ఎదుర్కొన్నా. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నాకు కంగారుగా ఉంది’ అని పాయల్ తెలిపింది. నొప్పి వల్ల రాత్రంతా తాను నిద్రపోలేదని చెప్పింది. ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ ఘోష్ కథానాయికగా పరిచయం అయింది. ‘ఊసరవెల్లి’ సినిమాలో సహాయ నటిగా కూడా నటించింది..

తెలిసినవాళ్లు కాదు కానీ ఓ ప్లాన్ ప్రకారం చేశారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ సంఘటన తరువాత నుంచి ప్రతి క్షణం తనకు భయమేస్తుందని.. దాన్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంటుందని వివరించింది. ‘పటేల్ కీ పంజాబీ షాదీ’ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పాయ‌ల్‌కి అక్క‌డే నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఈ బ్యూటీ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలు చేసింది.