Pawan kalyan : ప్రధాని మోడీ విశాఖ పర్యటన : పవన్ కళ్యాణ్‌కి ‘పిలుపు’ అందలేదా.?
NQ Staff - November 9, 2022 / 03:58 PM IST

Pawan kalyan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళ క్రితమే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఆ కార్యక్రమంలో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా పాల్గొన్నారు.
అయితే, ఆ కార్యక్రమానికి పిలుపు అందుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేకపోయారనుకోండి.. అది వేరే సంగతి.
ఈసారి పిలుపు అందలేదా.?
ఈసారి జనసేన అధినేతకు ప్రధాని విశాఖ పర్యటన విషయమై ఎలాంటి అధికారిక సమాచారమూ (ప్రత్యేక పిలుపు) అందలేదన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. భీమవరం టూర్ వేరు, విశాఖ పర్యటన వేరు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు, పలు ప్రారంభోత్సవాల్లోనూ ప్రధాని పాల్గొంటారు.
అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ మైత్రి వున్నా.. మిత్రపక్షం జనసేనకు బీజేపీ ఎలా ఆహ్వానం పలుకుతుంది.? అన్నది ఓ చర్చ. సరే, మిత్ర పక్షంతో రాజకీయ అంశాలపై చర్చ కోసం ప్రధాని మోడీ, ప్రత్యేక భేటీకి అవకాశం కల్పించేందుకూ వీలుంది. కానీ, ప్రధాని ఆ అవకాశం జనసేనానికి ఇస్తున్నట్లు కనిపించడం లేదు.
ఈ మొత్తం వ్యవహారంపై జనసేన పార్టీ ఒకింత వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.