Pawan producers trouble : చంద్రబాబు అరెస్ట్ తో పవన్ నిర్మాతల గుండెల్లో గుబులు..!
NQ Staff - September 10, 2023 / 12:24 PM IST

Pawan producers trouble : పవన్ కల్యాణ్ ఇప్పుడు అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నడుమ ఎక్కువగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వారాహి యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన ఎక్కువగా రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉంటున్నారు. దాంతో ఆయన ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు షూటింగులు పెట్టుకుంటున్నారు సినిమా వాళ్లు. దాంతో నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ కావట్లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు మీద పడుతున్నాయని నిర్మాతలు ఇప్పటికే పలుసార్లు వాపోయారు.
అయితే ఇప్పుడు మరోసారి నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే చంద్రబాబును నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా చంద్రబాబును కాపాడుకోవడమే పవన్ కల్యాణ్ పని. ఎందుకంటే వీరిద్దరికీ రాజకీయ ప్యాకేజీ ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ అని నిత్యం వైసీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే ప్రతి విషయంలో కూడా చంద్రబాబుకే తన మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు పవన కల్యాణ్. ఇక చంద్రబాబును అరెస్ట్ చేస్తే పవన్ చలించకుండా ఉండరు కదా.
ఆల్రెడీ రియాక్ట్ కూడా అయ్యారు. వీడియో రిలీజ్ చేసి చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగరని నిర్మాతలు భయపడుతున్నారు. త్వరలోనే చంద్రబాబు కోసం యాక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఆయన చేతిలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా నిర్మాతలు టెన్షన్ లో పడ్డారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ సినిమా కోసం కాల్షీట్లు కేటాయించారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి అయింది.
అటు ఓజీ సినిమా కోసం పవన్ కాల్షీట్లు ఇచ్చేశారు. పవన్ వస్తే ఇంకో 30 శాతం కంప్లీట్ అవుతుంది. దాంతో మూవీ దాదాపు షూటింగ్ అయిపోయినట్టే. కానీ ఇప్పుడు పవన్ కోసం ఎదురు చూస్తున్న మూవీ టీమ్ కు దెబ్బ తగిలింది. ఇప్పుడు పవన్ మళ్లీ రాజకీయాల్లోనే బిజీ అయిపోతే తమ పరిస్థితి ఏం కావాలని వాపోతున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా సంగతి ఎంత తక్కువగా చెబితే అంత బెటర్. కొన్నేళ్లుగా వాళ్లు పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఇలా సినిమా వాళ్లందరూ పవన్ కోసం చూస్తుంటే ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనే టెన్షన్ వారిని వెంటాడుతోంది. కాబట్టి పవన్ ఇప్పటికప్పుడు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని వారు వాపోతున్నారు. పవన్ వల్ల మొత్తానికి నిర్మాతలు, డైరెక్టర్లు, ఇతర ఆర్టిస్టులు ఇబ్బందుల్లో పడిపోతున్నారు.