Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూతురు కారులోంచి దూకెయ్యాలనుకుందిట.! రేణు దేశాయ్ పోస్ట్ వైరల్.!
NQ Staff - January 4, 2023 / 01:32 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య, వేగంగా వెళుతోన్న కారులోంచి దూకెయ్యాలనుకుందట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌ల సంతానం అకిరానందన్, ఆద్య. అకిరానందన్ ఈ మధ్యనే ‘ఖుషి’ సినిమా రి-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌లో సందడి చేశాడు.. అదీ హైద్రాబాద్‌లో. త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడు అకిరానందన్ హీరోగా.
అల్లరి ఆద్య..
కుమార్తె ఆద్య అల్లరి గురించి తరచూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫొటోలు వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం భారతదేశంలోని మంచు కొండల్లో విహరిస్తున్నారు రేణు దేశాయ్, ఆమె కుమార్తె ఆద్య.
అలా ఓ కారులో వెళుతూన్న వీడియో షేర్ చేస్తూ, కారులోంచి మంచులోకి దూకెయ్యాలని ఆద్య అనుకుంటోంది.. అంటూ పేర్కొంది రేణు దేశాయ్. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆద్య అనే కాదు.. ఆ వయసులో.. ఆ మాటకొస్తే, ఏ వయసులోవారైనా.. మంచులో ఎంజాయ్ చెయ్యాలని అనుకోకుండా వుండగలరా.?