Pawan Kalyan : జనసేనని జనానికి దూరం చేస్తున్న పవన్ కామెంట్లు
NQ Staff - July 11, 2023 / 07:22 PM IST

Pawan Kalyan :
రాజకీయాల గురించి మాట్లాడడానికి ఏ స్టేజీ ఎక్కినా, పార్టీ ప్రచారాల్లో భాగంగా ఏ సభకు హాజరయినా తెగ ఊగిపోతూ, ఆవేశంతో అధికార పార్టీ మీద పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోయడం గురించి అందరికీ తెలిసిదే. కానీ ఫస్ట్ టైమ్.. తన కామెంట్స్ వల్ల పార్టీ ఏ మేరకు నష్టపోవాల్సొస్తుందో, మాటలు మిస్ ఫైర్ అయితే ఎంతలా ఎఫెక్టువుతుందో జనసేనానికి తెలిసొచ్చిందిప్పుడు.
వాలంటీర్ల మీద చేసిన ఆరోపణల వల్ల వైసీపీ నుంచే కాదు.. సొంత పార్టీ నేతల నుంచి కూడా విముఖత ఎదుర్కోవాల్సిన పరిస్థితొచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏపీ మొత్తంలో దాదాపు రెండున్నర లక్షల మందితో ఉన్న వాలంటీర్ వ్యవస్థను అవమానిస్తూ.. హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ చేసిన కామెంట్స్ వల్ల పవన్ ఘోర పరాభవం చవిచూడాల్సొచ్చింది.
నోటిదురుసుతో చేసిన ఈ వ్యాఖ్యల వల్ల వాలంటీర్ల నుంచీ, వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకంత ఎదురవుతుంది. లక్షలాది మంది వాలంటీర్లు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ, దిష్టిబొమ్మలు కాలబెడుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఎలక్షన్ల నాటికి జనసేన వైపు ఓటర్లను మల్లించుకోవడం పక్కనపెడితే, వాలంటీర్లు అసాంఘీక శక్తులు అన్నట్టుగా మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో పాటు, వారి కుటుంబ సభ్యులు.. అంటే దాదాపు పది లక్షల మందితో లేని నెగిటివిటీని మూటగట్టుకున్నాడు పవన్.
నిజానికి వాలంటీర్లు చేస్తోన్న పని ఇంతా అంతా కాదు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాళ్లందిస్తున్న సేవలు తక్కువేంద కాదు. కరోనా, లాక్ డౌన్, వానలు, వరదల వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వాళ్ల సేవలను నిరంతరాయంగా కొనసాగించారు. కోవిడ్ సోకి ఎవరైనా మరణిస్తే వారి కుటుంసభ్యులు, అయినవాళ్లు కూడా దగ్గరికెళ్లడానికి భయపడ్డ రోజుల్లో మ్రుతదేహాలను తీసుకెళ్లి కర్మకాండలు జరిపించారు వాలంటీర్లు.
గోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తినప్పుడు కూడా వాలంటీర్లు వ్రుత్తిధర్మాన్ని నిర్వర్తించకుండా వెనకడుగు వేయలేదు. పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి సరుకులు ఇచ్చి, వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న వారికి మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చారు వాలంటీర్లు.
ఇన్ని చూస్తూ కూడా అలాంటి వాలంటీర్ల మీద ఆరోపణలు చేసి, లేని గొడవని నెత్తినెత్తుకున్నాడంటూ సొంత పార్టీ నేతలే తల పట్టుకుంటున్నారు. ఒక్క రోజులోనే అంత పెద్ద వ్యవస్థను తనకు పూర్తి వ్యతిరేకంగా మార్చుకున్న పవన్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్తాడేమో అనుకుంటే, మరో కొత్త వర్షన్ తో కవర్ డ్రైవ్ కి రెడీ అయిపోయాడు కాటమరాయుడు.
వాలంటీర్లు అందరూ కాకున్నా కొందరు చెడ్డవాళ్లున్నారు అంటూ స్వరం మార్చి సన్నాయి నొక్కుళ్లకు సన్నద్దమయ్యాడు. ప్రస్తుతం తాను పర్యటిస్తున్న గోదావరి జిల్లాలో అయన సామాజికవర్గానికి చెందిన కాపు యువత ఎంతోమంది వాలంటీర్లుగా ఉన్నారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు వారిని ఆగ్రహానికి గురిచేసినట్టేగా. వారి కుటుంబసభ్యుల చేత కూడా విమర్శలు చేయించుకోడానికి ఆహ్వానం ఇచ్చినట్టేగా.

Pawan Kalyan
పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఇలా మాట్లాడి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే కదా అని జనసైనికులే బాహాటంగా బాధపడుతూ చెప్పుకునే పరిస్థితి. సీఎం ని చేయండి అని స్పీచులు దంచడం, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపండి అని అడగడం తర్వాత.. పార్టీకి సమాధి కట్టించే నెగిటివ్ కామెంట్స్ ఏంటో, ప్రజాబలాన్ని పెంచుకునే మాటలేంటో తెలుసుకోలేనివాడిగా మిగిలిపోతే మాత్రం కష్టమే అంటూ కార్యకర్తలే చెప్పుకుంటున్నారంటే కష్టమే ఇక.