Pawan Kalyan: ఒక వైపు మాట‌లు, మరోవైపు ట్వీట్స్‌తో వైసీపీని వ‌ణికిస్తున్న‌ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan: రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో పవన్‌ కళ్యాణ్‌..జగన్‌ సర్కార్‌ పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.ఆయ‌న పేల్చిన తూటాల‌కు వైసీపీ మంత్రులు వ‌రుస మీట్ల‌తో ప‌వ‌న్‌పై ఎదురు దాడి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ వైసీపీ సర్కార్‌ పై వైఫల్యాలపై పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా సంచలన ట్వీట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan Tweets against AP Government
Tollywood Film Chamber Gave Big Jolt to Pawan Kalyan

వైసిపి పార్టీ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ మరియు రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని… కానీ వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని నిప్పులు చెరిగారు.

తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…అంటూ ఒక ట్వీట్ వేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత హూ లెట్ దీస్ డాగ్స్ ఔట్ అనే పాపుల‌ర్ పాప్ సాంగ్ లింక్ షేర్ చేశాడు. ఒక ట్వీట్ ద్వారా త‌న‌ను విమ‌ర్శిస్తున్న వైకాపా నేత‌లు, మ‌ద్ద‌తుదారుల‌ను ప‌రోక్షంగా కుక్క‌లు అని పేర్కొన్న ప‌వ‌న్.. త‌న మీదికి ఆ కుక్క‌ల్ని ఎవ‌రు వ‌దిలారో తెలుసు అనే సంకేతాన్ని మ‌రో ట్వీట్ ఇచ్చాడు.

ప‌వన్ ట్వీట్లు జ‌న‌సైనికుల‌కు మామూలు కిక్ ఇవ్వ‌లేదు. ఆయ‌న ప‌దునైన ట్వీట్స్ జ‌న సైనికుల‌లో మ‌రింత ఉత్సాహం ఉత్తేజాన్ని క‌లిగిస్తున్నాయి. ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఒక‌ప్పుడు ఆవేశానికి మారుపేరులా ఉండేవాడు. కానీ సొంతంగా పార్టీ పెట్టాక ఆయ‌న ఆవేశం, దూకుడు చాలా వ‌ర‌కు త‌గ్గింది. స‌మయం వ‌చ్చిన‌ప్పుడు గ‌ట్టిగా మాట్లాడ‌డం, మిగ‌తా కూల్‌గా పంచ్‌లు విస‌ర‌డం వంటివి చేస్తున్నాడు. ప‌వన్ ట్వీట్స్ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.