Pawan Kalyan: త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప‌వ‌న్ ట్వీట్ ప్ర‌స్తావ‌న‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యాన్స్

Pawan Kalyan: కొద్ది రోజుల క్రితం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న 50వ బ‌ర్త్ డే జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎంతో మంది అభిమానులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయకులు ఆయ‌న‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప‌వ‌న్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో నిన్న అంద‌రికి అర్ధ‌మైంది. అయితే అంత‌క‌ముందు రోజు ప‌వ‌న్ .. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ గురించి స‌ర్‌ప్రైజింగ్ ట్వీట్ చేశారు.

మరికొన్ని గంటలకే ఆయన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్వయంగా వెళ్లి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కలిశారు.. ఈ రెండు అంశాలను తమిళనాడు అసెంబ్లీ లో ప్రస్తావనకు వచ్చాయి. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ ను అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్ ని తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంలో అసెంబ్లీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు..పవన్ కళ్యాణ్ ట్విట్ తో పాటు, చిరంజీవి కలిసిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం స్టాలిన్ పై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.

ప‌వన్ ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ… ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని చాలామంది మాటల్లో చెపుతారు కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్ష‌లు అని తెలిపారు.

ఇక చిరంజీవి.. స్టాలిన్‌ని క‌లిసి వ‌చ్చాక త‌న సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు.రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. స్టాలిన్‌ని ఆత్మీయంగా క‌లుసుకున్న ఫోటోలు కూడా షేర్ చేశాడు.