Pawan Kalyan Statements : పూటకొక మాట మారుస్తున్న పవన్.. ఒక్క మాటపై ఉండని జనసేనాని..!

NQ Staff - September 6, 2023 / 11:35 AM IST

Pawan Kalyan Statements : పూటకొక మాట మారుస్తున్న పవన్.. ఒక్క మాటపై ఉండని జనసేనాని..!

Pawan Kalyan Statements : పవన్ కల్యాణ్‌ మాటలు ఎలా ఉంటాయంటే.. పూటకో రకంగా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలపై ఒక గంట తర్వాత కూడా ఉంటారని నమ్మకం లేదు. ఒకసారి ఒక ప్రకటన చేయడం.. మళ్లీ దానిపై యథేచ్ఛగా మాట మార్చేయడం కేవలం పవన్ కు మాత్రమే వచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నో తలా తోక లేని విమర్శలు చేశారు. కానీ ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేదు. ఏమైనా అంటే మళ్లీ ఆ ఆరోపణ గురించి మాట్లాడడు. మొన్న వాలంటీర్ల మీద కూడా ఇలాంటి కామెంట్లు చేసి తిట్లు తిన్నాడు పవన్ కల్యాణ్‌.

ఇక ఏ పండుగ అయినా, ఏ ముఖ్యమైన రోజు వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నాడు. ఇక ఆఖరకు టీచర్స్ డే ను కూడా వదల్లేదు పవన్. టీచర్స్ డే సందర్భంగా తనకు చదువు నేర్పిన గురువులందరికీ ధన్యావాదాలు తెలిపాడు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమ, వాత్సల్యం మనం గురువుల దగ్గరి నుంచే పొందుతామంటూ వివరించాడు పవన్ కల్యాణ్‌. అయితే టీచర్స్ డే వచ్చినా ఇంకా టీచర్లకు జీతాలు వేయట్లేదని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. టీచర్ల విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారుల చర్యలు ఎప్పుడూ విమర్శల పాలు అవుతున్నాయంటూ తెలిపాడు పవన్.

నాడు-నేడు కార్యక్రమంలో తప్పులు జరిగితే హెచ్ ఎంలను బలి చేస్తున్నారంటే మండిపడ్డాడు పవన్ కల్యాణ్‌. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ, ప్రమోషన్లు పొందిన అయిన 30 వేల మంది ఉపాధ్యాయులకు కొన్ని నెలలుగా జగన్ ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని వాపోయాడు. జనసేన ప్రభుత్వం రాగానే వారి కష్టాలు తీరుస్తామని ప్రకటించాడు. దాంతో మళ్లీ జనసైనికులు ఆగమైపోతున్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి బీజేపీ మిత్ర పక్షాలతో భేటీ అయిన తర్వాత ఏపీలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని చెప్పాడు. ఇప్పుడేమో మళ్లీ జనసేన ప్రభుత్వం అంటున్నాడు.

అంటే బీజేపీతో పొత్తులు ఉండవని ఇన్ డైరెక్టుగా చెబతున్నాడా.. దాన్ని బట్టి టీడీపీతో కూడా పొత్తులు ఉండవని చంద్రబాబు అర్థం చేసుకోవాలా ఇప్పుడుమ. మొన్ననేమో జనసేన ప్రభుత్వం ఏర్పడటం కంటే కూడా జగన్ ఓడించే ప్రభుత్వం రావడమే ముఖ్యం అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్లీ మాట మార్చేశాడు. అసలు పొత్తులపై ఒక మాటపై ఎప్పుడూ పవన్ ఉండట్లేదు. ఇలా పూటకో మాట మాట్లాడుతూ జనసైనికులను ఆగం చేస్తున్నాడు.

పాపం జనసేన కార్యకర్తలేమో తాము ఒంటరిగా పోటీ చేస్తామని తమకు అవకాశాలు వస్తాయని ఆశగా ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఓ సారి పొత్తులు అంటూ షాక్ ఇస్తున్నాడు. ఇంకోసారి ఎన్డీయే ప్రభుత్వం అంటున్నాడు. ఇంకోసారి జనసేన ప్రభుత్వం అంటున్నాడు. అసలు జనసేన ప్రభుత్వం ఎన్నడు రావాలి, పవన్ కల్యాణ్‌ ఎప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చాలని సెటైర్లు వేస్తున్నారు. పొత్తులపై పవన్ ఒక మాట మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us