Pawan Kalyan : ప్రభాస్, మహేశ్ నాకంటే పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ సెన్సేషనల్..!
NQ Staff - June 22, 2023 / 09:42 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగులో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే సొంతం. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వారాహి యాత్రలో ఆయన చాలా పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తున్నారు.
తాజాగా ఆయన ముమ్మడివరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో ఆయన టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. నాకు కొందరు చెబుతుంటారు. మీ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిత్యం గొడవపడుతారు అని. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే.
కాబట్టి ఎవరూ గొడవపడొద్దు. నేను టాలీవుడ్ హీరోలందరితో బాగానే ఉంటాను. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు అందరూ నాకు చాలా ఇష్టం. ప్రభాస్, మహేశ్ నాకంటే పెద్ద హీరోలు. నాకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
వారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గ్లోబల్ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వాళ్ల అంత నాకు గుర్తింపు లేదు. ఇవన్నీ చెప్పడానికి నాకు ఇగోలు లేవు. నేను చాలా సూటిగా మాట్లాడుతాను. కాబట్టి ఎవరూ దయచేసి గొడవలు పెట్టుకోవద్దు అంటూ తెలిపాడు పవన్.