Unstoppable 2 : ఆహాహా.! బాలకృష్ణ సాక్షిగా సీఎం పవన్ కళ్యాణ్ నినాదాలు.!
NQ Staff - December 27, 2022 / 03:52 PM IST

Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆప్యాయంగా ఒకర్నొకరు కౌగలించుకున్నారు. ‘ఆహా’ అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం పవన్ కళ్యాణ్ రాగా, ఆయనకు ఘన స్వాగతం పలికారు నందమూరి బాలకృష్ణ.
ఇద్దరూ సినీ ప్రముఖులు.. అంతే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నందమూరి వర్సెస్ మెగా.. అన్న ‘పోటీ’ కనిపిస్తూ వస్తోన్న విషయం విదితమే.
అభిమానుల హంగామా.. కంట్రోల్ చేయలేకపోయిన నిర్వాహకులు..
ఇప్పటిదాకా ‘ఆహా’ కోసం పలు ఎపిసోడ్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. అన్ స్టాపబుల్ టాక్ షో కోసం వచ్చిన గెస్టుల లిస్టు కూడా పెద్దదే. మహేష్, ప్రభాస్.. ఇలా చాలాంది స్టార్ హీరోలు ఈ టాక్ షోలో సందడి చేశారు.
అయితే, కేవలం పవన్ కళ్యాణ్‌కి మాత్రమే స్టూడియో వద్ద లైవ్ కవరేజ్ జరిగింది. అభిమానులు పోటెత్తారు. బాలకృష్ణ అక్కడ వుండగానే, సీఎం పవన్ కళ్యాణ్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ క్రమంలో బాలయ్య అభిమానులు కొంత నొచ్చుకున్నట్లే కనిపిస్తోంది.
నందమూరి వర్సెస్ మెగా.. అన్న సోషల్ రచ్చకి తెరదించేలా, బాలయ్య – పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా కౌగలించుకోవడం ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.