Pawan Kalyan : వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాత్మక ప్లాన్.. ఎక్క‌డి నుండి పోటీ చేయ‌నున్నాడో తెలుసా?

Pawan Kalyan : ఆంధ‌ప్రదేశ్‌లో రాజ‌కీయం రోజురోజుకి ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్‌ని ఓడించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బలంగా ఉన్న సీఎం జగన్ ను ఢీ కొట్టాలి అంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా వెళ్తే కష్టమన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇటు టీడీపీ సీనియర్ నేతలు, అభిమానులు, ఇరు పార్టీల కార్యకర్తలు అదే కోరుకుంటున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు.

Pawan Kalyan next election planing
Pawan Kalyan next election planing

2024 ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలి అనే లక్ష్యంతో ప్రతిపక్షాలు అడుగులు వేసున్నాయి. ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.. విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసారు ప‌వ‌న్. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.

ఇప్పటికీ వైసీపీ నేతలు ఆ ఓటమి గురించి ప్రస్తావిస్తేనే ఉన్నారు. దీంతో..ఈ సారి టీడీపీతో పొత్తు ఉన్నా.. బీజేపీతోనే కొనసాగినా తాను ఎక్కడ పోటీ చేయాలనే దాని పైన పవన్ ఇప్పటికే క్లారిటీకి వచ్చేసారని పార్టీ ముఖ్యనేతల సమాచారం. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే జిల్లా అయిన తూర్పు గోదావరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదారి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కాకినాడ పైన పవన్ ఫోకస్ పెట్టారు.

అదే విధంగా.. కాకినాడ రూరల్ పైన చర్చలు చేస్తున్నారు. అక్కడ నుంచి మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తొలుత ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు. తిరిగి 2019 లోనూ ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు నియోజకవర్గాల్లో రూరల్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తాను అక్కడి నుంచి పోటీ చేస్తే..ఈ సారి మారుతన్న సామాజిక సమీకరణాల్లో జిల్లా లో ఆ ప్రభావం ఉంటుందని..కాకినాడ ఎంపీ సీటు కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక, గతంలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయగా.. ఈ సారి రాయలసీమ నుంచి పోటీ చేసి వైసీపీకి బలమైన సంకేతాలు ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది.

సీమలో బలిజ వర్గం తిరుపతి బై పోల్ సమయంలో జనసేన అభ్యర్ధిని బరిలో దించాలని డిమాండ్ చేసింది. బీజేపీ నుంచి అభ్యర్ది పోటీ చేసారు. దీంతో..రాయలసీమలో ఆయన అనంతపురం నుంచి గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అయినా.. ఈ సారి పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. అప్పుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ద్వారా అక్కడి సామాజిక సమీకరణాలు సఫలం అయితే, ఖచ్చితంగా వైసీపీకి నష్టం తప్పదనే విశ్లేషణ వినిపిస్తోంది.

ఈ సారి పవన్ ,చంద్రబాబు, జగన్ ముగ్గురూ రాయలసీమ నుంచే పోటీ చేయటం ద్వారా అక్కడి బలా బలాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మొత్తంగా… ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.