హాలీవుడ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ మూవీ

Advertisement

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే పవన్ పుట్టిన రోజున తాను నటిస్తున్న సినిమాల పోస్టర్లు విడుదల చేసారు. ఇక ఆ పోస్టర్లు చూసి ఫ్యాన్స్ అందరు తెగ ఆనంద పడిపోయారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ కూడా రిలీజ్ చేసారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు విరూపాక్షి అనే టైటిల్ ను పెట్టాలని ఆలచనలో ఉన్నారంట. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలయిన పదిహేను రోజులకే కరోనా దృష్ట్యా వాయిదా పడింది. అయితే ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్ హైలెట్ గా ఉండనున్నాయట. దీనికోసం హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకురానున్నారని సమాచారం. హాలీవుడ్ లో ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి చిత్రాలకు పని చేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here