Pawan Kalyan : మీలా ఢీల్లీకి వెళ్లి ప్రధానికి చాడీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు : పవన్
NQ Staff - November 27, 2022 / 08:12 PM IST

Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి అధికార వైకాపా పై నిప్పులు చెరిగారు. వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థనా? మా వాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరు అండగా ఉంటే వారిపై రాజకీయ కుట్ర చేస్తారా.. రాజకీయం మీరే చేయగలరా, మేం చేయలేమా? రాజకీయాన్ని మీరే చేయాలా… మేము చేయలేమా, మేము చేసి చూపిస్తాం. ఫ్యూడలిస్ట్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పడం ఇల్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశం అయ్యారు. బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ను పవన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 తర్వాత ప్రధాని ని మూడు నాలుగు సార్లు మాత్రమే కలిశాను. ఆ సందర్భాల్లో నేను ప్రధానితో ఏం మాట్లాడానో చెప్పాలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జలు అడుగుతున్నారు.
మీ చెవిలో చెప్తా నా దగ్గరికి రండి.. నేనెప్పుడూ మాట్లాడిన కూడా దేశ భద్రత సగటు మనిషి రక్షణ కోరుకుంటా.. అంతే కానీ మీ మాదిరిగా ఢిల్లీ వెళ్లి ప్రధానికి చాడీలు చెప్పను. వైకాపా ను దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను, అది నేనే చేస్తా. ఈ నేలపై పుట్టినోడిని.. ఆంధ్రుడిని, ఆంధ్రాలోనే తేల్చుకుంటా అంటూ తీవ్ర స్వరంతో వైకాపా నేతలను హెచ్చరించాడు.