Pawan Kalyan : టీడీపీతో జనసేన పొత్తుపై జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు.!
NQ Staff - December 19, 2022 / 09:20 AM IST

Pawan Kalyan : మళ్ళీ మళ్ళీ అదే మాట.! వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా అధికార వైసీపీ నుంచి జనసేన మీదకి విమర్శనాస్త్రాలు దూసుకెళుతున్నాయి.
‘మేం చెబుతున్నదీ అదే కదా.. ముసుగులో గుద్దులాట ఎందుకు.? టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించెయ్యొచ్చు కదా..’ అంటూ జనసేనపై మండిపడుతోంది వైసీపీ.
ఇంతకీ జనసేనాని చెప్పిందేంటి..?
‘జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది..’ అంటూ తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధికారంలోకి వస్తుంది.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వను.. ఈ రెండు వ్యాఖ్యల్నీ పరిగణనలోకి తీసుకుంటే, టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖాయమేగానీ, ఈ కూటమి గెలిస్తే అధికార పీఠమెక్కేది జనసేన అట. అదెలా సాధ్యం.?
అసలంటూ టీడీపీ ఇంతవరకు జనసేనతో పొత్తు విషయమై అధికారిక ప్రకటన చేయలేదు. పోనీ, జనసేన మిత్రపక్షమైన బీజేపీ అయినా, ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించిందా.? అంటే అదీ లేదు.!