Comedian Ali : కమెడియన్‌ అలీకి ఛాన్సులు రావట్లేదా.. ఆయనతో పెట్టుకున్నందుకేనా..?

NQ Staff - January 30, 2023 / 07:40 PM IST

Comedian Ali : కమెడియన్‌ అలీకి ఛాన్సులు రావట్లేదా.. ఆయనతో పెట్టుకున్నందుకేనా..?

Comedian Ali : కమెడియన్‌ గా, హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు అలీ. నటుడిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎవరితో ఎలా మెలగాలో అలీకి బాగా తెలుసు. అందుకే ఆయన ఇన్నేండ్లు వచ్చినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఆయనకు మొదటి నుంచి కొండంత అండగా ఉన్న పవన్‌ను దూరం చేసుకున్నాడు.

ఇదే ఆయనకు అతిపెద్ద మైనస్‌ అయిపోయింది. అప్పట్లో అలీ లేకుండా పవన్‌ ఒక్క సినిమా కూడా చేసేవాడు కాదు. కానీ రాజకీయంగా అలీ వైసీపీకి వెళ్లడంతో జనసేన అధినేత అయిన పవన్‌కు వ్యతిరేకం అయిపోయాడు. పైకి మేమింకా స్నేహితులమే అని చెబుతున్నా కూడా.. పవన్‌ మాత్రం అలీని దూరంగానే ఉంచుతున్నాడు.

అలీ మీద విమర్శలు..

 Pawan Kalyan Keeping Comedian Ali Away

Pawan Kalyan Keeping Comedian Ali Away

ఇదిలా ఉంటే మొన్న మీడియాతో మాట్లాడుతూ పవన్‌ మీద పోటీ చేస్తానంటూ సంచలన కామెంట్లు చేశాడు అలీ. అప్పటి నుంచే పవన్‌ ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యామిలీకి అలీ టార్గెట్‌ అయిపోయాడు. ఆయన మీద దారుణంగా విమర్శలు, ట్రోల్స్‌ వస్తున్నాయి. పవన్‌ మీద పోటీ చేసేంత స్థాయి నీది కాదంటూ చాలామంది అంటున్నారు.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి సపోర్టుగా ఉండే చాలామంది నిర్మాతలు ఇప్పుడు అలీకి ఛాన్స్‌ ఇవ్వడానికి ముందుకు రావట్లేదంట. అలీ వెళ్లి అడిగినా పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఆయన చేతిలో రెండు సినిమాలు కూడా పోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు అలీ అనవసరంగా పవన్‌ తో పెట్టుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us