Pawan Kalyan Is Targeting YS Jagan : మతిస్థిమితం లేనిది జగన్ కు కాదు.. పవన్ కే.. ఇదే సాక్ష్యం..!
NQ Staff - September 17, 2023 / 01:18 PM IST

Pawan Kalyan Is Targeting YS Jagan
పవన్ కల్యాణ్ ఈ నడుమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు. రాజకీయ విలువలను దాటేసి మరీ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. ఒక రకంగా రాజకీయంగా కంటే కూడా జగన్ మీద వ్యక్తిగతంగా పగ పెంచుకున్నాడని అర్థం అవుతోంది. ఇందుకు ఆయన మాటలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా నిన్న మంగళిగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ జగన్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని అన్నాడు. అంతే కాకుండా జగన్ ను ఎవరైకైనా సైకియాట్రిస్ట్ కు చూపించాలని వైసీపీ నేతలకు ఆయన సూచించాడు.
ఇంతటితో ఆగకుండా.. ప్రజలంతా ఒక్కటైతే నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు జగన్.. అప్పుడు ఎవరూ ఏం చేయలేరు అంటూ చెప్పాడు పవన్ కల్యాణ్. ఈ మాటలు జగన్ మీద పవన్ కు వ్యక్తిగతంగా ఎంత పగ పెంచేశాయో అర్థం చేసుకోవచ్చు. అయితే పవన్ మరికొన్ని కామెంట్లు కూడా చేశాడు. వాటిని బట్టి పవన్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని అర్థం అవుతోంది. అదేంటంటే పవన్ ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించాడు. దాన్ని నాదెండ్ల భాస్కర్ వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం మోడీ మద్దతుతో టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.
మనతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిద్దాం. అలాగే తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నాం. కానీ అక్కడ టీడీపీతో కలిసి పోటీ చేయాలా లేదా బీజేపీతో కలిసి పోటీ చేయాలా అనేది చూద్దాం అంటూ తెలిపారు. మనం ఎన్డీయేలోనే ఉన్నాం. బీజేపీలోనే ఉన్నాం అంటూ ఈ తీర్మానాన్ని ముగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పవన్ తయారు చేసిన తీర్మానం చూస్తేనే ఆయన మెంటల్ కండీషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఎన్డీలోనే ఉన్నాం.. బీజేపీ మనతో కలిసి వస్తుందని ఆశిద్దాం అంటాడు. మరో లైన్ లో మోడీ మద్దతుతోనే టీడీపీతో కలిసి వెళ్తున్నాం అంటాడు.
ఇది చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. ఎందుకంటే మోడీ మద్దతు ఉన్న తర్వాత మళ్లీ బీజేపీ కలిసి వస్తుందని ఆశించడం ఇంకెందుకు అని అంటున్నారు. అంటే రెండు నాల్కల ధోరణితో పవన్ కల్యాన్ వ్యవహరిస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఆయన మైండ్ కండీషన్ ను డిసైడ్ చేస్తోందని చెప్పుకోవాలి. గతంలో కూడా ఇలాంటి తలా తోక లేని వాగ్దానాలు ఎన్నో చేశాడు పవన్ కల్యాణ్. ముందు తాను సరిగ్గా ఉండట్లేదు గానీ.. జగన్ కు మానసిక స్థితి బాగా లేదని చెబుతున్నాడు.
జగన్ కు మతిస్థిమితం సరిగ్గా లేకపోతే అది వైసీపీ వాళ్లు చూసుకుంటాడు. జగన్ కు అంత మైండ్ పని చేయకపోతే అది వైసీపీకే నష్టం కదా.. మరి వాళ్లకు లేని ఇబ్బంది పవన్ కు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవట్లేదు. ఇది ఎలా ఉందంటే.. దొంగే స్వయంగా దొంగా దొంగా అని అరిచినట్టు ఉంది. తన మతిస్థిమితం లేక.. పవన్ ఇలా అందరినీ ఆడిపోసుకుంటున్నాడని అర్థం అవుతోంది.