Pawan Kalyan Fans Are Angry With Trivikram Srinivas : పవన్ ను నిండా ముంచేస్తున్న త్రివిక్రమ్.. భగ్గుమంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్..!
NQ Staff - August 2, 2023 / 10:28 AM IST

Pawan Kalyan Fans Are Angry With Trivikram Srinivas :
పవన్ కల్యాణ్ ఈ నడుమ అటు రాజకీయాల్లో బిజీ అయిపోతున్నాడు. దాంతో సినిమాల బాధ్యతలు మొత్తం తనకు ఆప్త మిత్రుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో పెట్టేశాడు. సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం మాట్లాడాలన్నా సరే ముందుగా త్రివిక్రమ్ ను కలవాల్సిందే. ఆయన ఓకే అంటేనే పవన్ వద్దకు వెళ్తుంది.
గతంలో భీమ్లా నాయక్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమే. మొన్న వచ్చిన బ్రో సినిమా తెరకెక్కింది కూడా త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే. ఈ విషయాన్ని సముద్రఖని స్వయంగా వివరించాడు. అయితే త్రివిక్రమ్ తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ ఇమేజ్ ను రోజు రోజుకూ పడగొడుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.
రిజల్ట్ చూశాక..
బ్రో రిజల్ట్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ మీద భగ్గుమంటున్నారు. ఒరిజినల్ కథను మార్చేసి.. అందులోని సోల్ ను మిస్ చేశాడు త్రివిక్రమ్. పైగా ఏవేవో సీన్లు పెట్టేసి నాలుగు సాంగ్స్ రీమేక్ చేసేసి సినిమాను ఫైనల్ చేసేశాడు. అడ్డ దిడ్డంగా సినిమాను తీయడంతో బ్రో సినిమా అట్టర్ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది.
దాంతో త్రివిక్రమ్ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాల వల్లే సినిమా ప్లాప్ అయిందని తిడుతున్నారు. పవన్ ఏం చెప్పినా వింటున్నాడని.. త్రివిక్రమ్ ఇష్టం వచ్చినట్టు సినిమాలను సెట్ చేస్తున్నాడని మండి పడుతున్నారు. ఇప్పటికైనా త్రివిక్రమ్ ను దూరం పెడితేనే పవన్ సినిమాలు హిట్ అవుతాయని అంటున్నారు.