Sri Reddy : ఆ పావలా గాడికి ప్యాకేజ్ అందలేదేమో.. పవన్ పై శ్రీరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..!
NQ Staff - June 5, 2023 / 11:20 AM IST

Sri Reddy : కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి పనిగట్టుకుని మరీ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసినా సరే ఆమె మాత్రం అస్సలు తగ్గట్లేదు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా అకౌంట్లతో విరుచుకుపడుతూనే ఉంది ఈ భామ. ఇక ప్రస్తుతం ఆమె వైసీపీ మద్దతు దారుగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే పవన్ కల్యాన్ ఎన్నికల్ ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహిని ఇన్ని రోజులు బయటకు తీయలేదు. దాంతో శ్రీరెడ్డి ప్యాకేజీ అందింది కాబట్టే లోకేష్ కోసం పవన్ తన యాత్రను త్యాగం చేశాడంటూ అప్పట్లో విమర్శలు చేసింది. అయితే రీసెంట్ గా పవన్ వారాహి యాత్రపై అప్ డేట్ ఇచ్చారు జనసేన నేతలు.
జూన్ 14 నుంచి వారాహి యాత్ర షురూ కాబోతోంది అంటూ తెలిపారు. దాంతో మరోసారి శ్రీరెడ్డి రెచ్చిపోయింది. తాజాగా ఫేస్ బుక్ లో ఓ వీడియోలో బూతు పురాణాలు వల్లిస్తోంది. ఆ పావలా గాడికి బాబుగారి ప్యాకేజ్ అందలేదేమో. అందుకే వాడు వారాహి బండిని బయటకు తీస్తున్నాడు.
ఎంత పని చేశావ్ బాబు.. ప్యాకేజీకి భయపడి నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావా.. ఆ పావలా గాడికి ఎంతో కొంత పడేయాల్సింది. అప్పుడే వాడు సైలెంట్ అవుతాడు అంటూ దుమారం రేపే కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. దాంతో ఆమె చేసిన కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. నీకు సిగ్గుందా.. ప్రజల కోసం వస్తున్న పవన్ మీద ఇలాంటి కామెంట్లు ఇప్పటికైనా మానుకో అంటూ సలహా ఇస్తున్నారు.