Pawan Kalyan : పవన్‌ సీఎం అభ్యర్థి అయితే 200% గెలుపు ఖాయం.. బాబుకు సలహా

NQ Staff - January 30, 2023 / 10:23 AM IST

Pawan Kalyan : పవన్‌ సీఎం అభ్యర్థి అయితే 200% గెలుపు ఖాయం.. బాబుకు సలహా

Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014 తరహా పొత్తులతో వెళ్లాలని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతూనే ఉంది అన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సమాన దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

బీజేపీ కనుక తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు నో అంటే జనసేన పార్టీ దారి ఎటు అంటూ గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2014 తరహాలో పొత్తు తో ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఉంటాడు. అప్పుడు బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా పని చేస్తారు అనేది కూడా అనుమానమే.

అందుకే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడుకు ఒక మీడియా అధినేత సూచించారట. ఆయన మాటలను చంద్రబాబు నాయుడు గతంలో చాలా సార్లు పాటించారు. ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యున్నత గౌరవంను ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి సలహా మేరకు కచ్చితంగా చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏపీలో వైకాపా యొక్క పరిపాలన పోవడం ముఖ్యం.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా తిప్పుకోవడం చంద్రబాబుకు ఈజీ. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా తెలుగు దేశం పార్టీకి మరింత డ్యామేజీ అవుతుంది. కనుక వైకాపా ను అధికారంలోకి రాకుండా చేయాలి అంటే పవన్ కళ్యాన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు అంటూ ఆ మీడియా అధినేత సూచించారట.

సీట్లు తక్కువ ఇచ్చినా కూడా జనసేన పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేస్తే కచ్చితంగా ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే 2014 తరహా పొత్తులకు బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఆ ప్రకటన ఎప్పుడు చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

 Pawan Kalyan Equidistant From TDP And BJP

Pawan Kalyan Equidistant From BJP And TDP

బీజేపీ ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ కూడా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తే తప్పకుండా రాష్ట్రంలో వైకాపా కు కష్టాలు తప్పవు అంటున్నారు.

2014 తరహా పొత్తులతో.. పవన్ కళ్యాణ్‌ ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తే వైకాపా ఓటమి 200% ఖాయం అని.. కూటమి యొక్క విజయం 200% ఖాయం అన్నట్లుగా ఆ మీడియా అధినేత మాటల మధ్య చంద్రబాబు నాయుడుకు సూచించాడట. దాంతో కచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ సలహాను పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us