ఇంట్లోనే దీక్షలో కూర్చున్న పవన్ కళ్యాణ్

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ధర్మ పరిరక్షణ దీక్షను మొదలు పెట్టారు. అయితే తాజాగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసారు. ఇక ఈ నేపథ్యంలో జనసేన, బిజెపి లు సంయుక్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపును ఇచ్చారు.

ఇక ఈ పరిరక్షణ దీక్షకు ముందు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చలు నిర్వహించారు. ఇక ఇది ఇలా ఉంటే అంతర్వేదికి భారీగా జనసేన సైనికులు తరలి వెళ్ళారు. అలాగే బిజెపి నేతలు కూడా ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేసి రాష్ట్ర సర్కార్ పై వత్తిడి తేవాలని భావిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here