Pawan Kalyan Comments On Surekha Konidela : మా వదిన సురేఖ చేసిన ద్రోహం జీవితంలో మర్చిపోలేను.. పవన్ కల్యాన్ కామెంట్స్..!

NQ Staff - July 26, 2023 / 09:24 AM IST

Pawan Kalyan Comments On Surekha Konidela : మా వదిన సురేఖ చేసిన ద్రోహం జీవితంలో మర్చిపోలేను.. పవన్ కల్యాన్ కామెంట్స్..!

Pawan Kalyan Comments On Surekha Konidela :

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తన కెరీర్ అంటే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది తన పెద్ద వదిన సురేఖ అని చెప్పారు. ఆమె వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్టు అనేక స్టేజిల మీద ప్రకటించారు. కానీ మొట్టమొదటి సారి సురేఖ వదిన నాకు ద్రోహం చేసింది అని చెప్పి సంచలనం సృష్టించారు.

అసలు ఆయన ఎందుకు అలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కల్యాణ్‌ తాజాగా నటించిన మూవీ బ్రో ది అవతార్. సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. తమిళ రీమేక్ సినిమా వినోదయ సిత్తం కు ఇది రీమేక్. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు.

ఆమె వల్లే ఇలా..

Pawan Kalyan Comments On Surekha Konidela

Pawan Kalyan Comments On Surekha Konidela

ఇందులో పవన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వాస్తవానికి నేను కోరుకున్న జీవితం ఇది కాదు. అన్నయ్య మెగాస్టార్ అయిన తర్వాత నువ్వు హీరో అవుతావా అంటే భయమేసేది. కానీ నన్ను మా వదిన సురేఖ నమ్మింది. నన్ను సినిమాలు చేయమని ప్రోత్సహించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను సినిమాల్లోకి వచ్చాను.

ఓ రోజు జగదాంబ థియేటర్ వద్ద బస్‌ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. వెంటనే మా వదినకు ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె చేసిన తప్పు కారణంగానే నేను ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నాను. ఆమె నాకు చేసింది చాలా పెద్ద ద్రోహం. అందుకే కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అంటే తన వదిన చేసిన సాయాన్ని ఇలా సెటైరికల్ గా చెప్పారన్నమాట.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us