Pawan Kalyan : పవన్ జనసేనకు పొత్తుల ప్రచారంతో డ్యామేజీ తప్పదా?

NQ Staff - March 16, 2023 / 06:50 PM IST

Pawan Kalyan : పవన్ జనసేనకు పొత్తుల ప్రచారంతో డ్యామేజీ తప్పదా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఇదే అదునుగా భావించిన వైకాపా నాయకులు పవన్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా పొత్తు పెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. పొత్తు పెట్టుకుని సమయంలో పార్టీ ఓడిపోయింది. కనుక ఇతర పార్టీల నాయకులను ముఖ్యమంత్రిగా చేసేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్నారు.

ఆ వ్యాఖ్యలు జనసేన పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి. జనసేన పార్టీ నాయకుడు ఇప్పటికైనా పొత్తు విషయంలో ఒక స్పష్టత ఇచ్చి దానిపై విమర్శలు రాకుండా క్లారిటీ ఇవ్వాలని జనసేన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ నుండి ఎప్పటికి వస్తుందో చూడాలి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us